SLBC: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పరిణామం.. మృతదేహాల ఆనవాళ్లు లభ్యం!

by Shiva |   ( Updated:2025-03-09 03:11:47.0  )
SLBC: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పరిణామం.. మృతదేహాల ఆనవాళ్లు లభ్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: దోమలపెంట (Domalapenta)లోని ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ (SLBC Tunnel)లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) 16వ రోజుకు చేరుకున్నాయి. మొత్తం 11 రెస్క్యూ బృందాలు నిర్విరామంగా గత 15 రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందినట్లుగా భావిస్తున్న ఆ ఎనిమిది మందిని ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కి.మీ దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలకు మిగిలిన మరో 50 మీటర్లు ముందుకు వెళ్లే క్రమంలో సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఈ క్రమంలోనే సహాయక చర్యల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది కీలక పరిణామం చోటుచేసుకుంది. టెన్నెల్‌ (Tunnel)లో గల్లంతైన వారిని గుర్తించడంలో పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డీ-2 (D-2) అనే పాయింట్‌ వద్ద మృతదేహాల ఆనవాళ్లు కేరళ క్యాడవర్‌ డాగ్స్‌ (Kerala Cadaver Dogs) గుర్తించాయి. అయితే, అదే ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది శిథిలాలను మెళ్లిగా తొలగిస్తున్నారు. గల్లంతైన కార్మికులలో కొందరిని ఇవాళ రాత్రి లోపు గుర్తించే చాన్స్ ఉంది. కాగా, టన్నెల్‌ (Tunnel)లో మృతదేహాల ఆనవాళ్లు లభించాయనే వార్తలపై అధికారులు ఆఫీషియల్‌గా ప్రకటించ లేదు.

Next Story

Most Viewed