- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Singareni Elections : ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్
దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిలో గుర్తింపు సంఘం కోసం బుధవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 94.15 శాతం ఓట్లు పోలయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా 39,773 మంది కార్మికులు ఉండగా, 37,447 కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బెల్లంపల్లి ఏరియాలో 96.29 శాతం, మందమర్రిలో 93.38 శాతం, శ్రీరాంపూర్‌లో 93.03 శాతం, కార్పొరేట్‌లో 96.14 శాతం, కొత్తగూడెంలో 94.88 శాతం, ఎల్లందులో 98.37 శాతం, మణుగూరులో 97.06 శాతం, ఆర్జీ 1 లో 93.68 శాతం, ఆర్జీ 2 లో 94.74 శాతం, ఆర్జీ 3లో 93 శాతం, భూపాలపల్లిలో 94.70 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలింగ్ ముగియగానే అధికారులు బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొదటగా బ్యాలెట్ పత్రాలను కట్టలను కడుతున్న అధికారులు వాటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు.