- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ కాంగ్రెస్‌కు షాక్.. మరో కీలక నేత రాజీనామా..
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల నియామకం చిచ్చురేపింది. కాంగ్రెస్ లో కొత్త కమిటీలపై ఇప్పటికే ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా తాజా అదే బాటలో ఆ పార్టీ సీనియర్ నేత బెల్లయ్య నాయక్ అంసృప్తి వ్యక్తం చేశారు. జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్న తనకు రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో చోటు కల్పించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోమవారం టీపీసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బెల్లయ్య నాయకు పార్టీలో ఆదివాసి విభాగం జాతీయ కమిటీకి వైస్ చైర్మన్ గా ఉన్నారు. గతంలోను పార్టీ పదవుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బెల్లయ్య నాయక్.. తాజాగా పార్టీ ప్రకటించిన కమిటీలపైనా అంసృప్తి వ్యక్తం చేస్తూ తన అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది.
ఈ మేరకు రాజీనామా లేఖను టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పంపించారు. కాగా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో పేర్లు కనిపించని మరి కొంత మంది నేతలు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ల కంటే తక్కువ హోదా ఇచ్చారంటూ సీనియర్ నేతలు చేస్తున్న విమర్శలు పార్టీలో మరోసారి సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా మారిపోయింది. పదవుల పందేరం విషంలో రోజుకో నేత రాజీనామా బాట పట్టడంతో ఈ సిట్యుయేషన్ ను పార్టీ నాయకత్వం ఎలా హ్యాండిల్ చేయబోతోందనేది ఆసక్తిగా మారింది.
Read More...
Delhi liquor scam : ఇవాళ కీలక విచారణ.. కవితకు నోటీసుల నేపథ్యంలో ఉత్కంఠ