‘యాక్సిడెంట్‌లో మంగ్లీకి ఏం కాలేదు.. ఇండికేటర్ పగిలిందంతే’

by GSrikanth |
‘యాక్సిడెంట్‌లో మంగ్లీకి ఏం కాలేదు.. ఇండికేటర్ పగిలిందంతే’
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మంగ్లీకి గాయాలు అయ్యాయి. సోమవారం హైదరాబాద్-బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆమె కారును కారును అతివేగంగా వచ్చిన ఓ డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యారు. రంగారెడ్డి జిల్లా నందిగామ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే, తాజాగా.. మంగ్లీ కారు ప్రమాదంపై శంషాబాద్ పోలీసులు స్పందించారు. ‘శంషాబాద్ తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తోన్న వారికి కూడా ఏం కాలేదు. కేవలం కారు ఇండికేటర్ మాత్రమే పగిలింది’ అని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story