- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SFI : విద్యార్థుల ఆత్మహత్యలు.. ఇంటర్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా

దిశ, డైనమిక్ బ్యూరో: కార్పొరేట్ కళాశాలలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఎస్ఎఫ్ఐ తెలంగాణ ధర్నా చేపట్టింది. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు ముందు బైఠాయించి ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కాలేజీల్లో ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు చనిపోయారని, ఈ నెలలోనే నలుగురు విద్యార్థులు చనిపోయారని వివరించారు.
నగరంలోని కొండాపూర్, బాచుపల్లి, హయత్‌నగర్, మియాపూర్ లాంటి చోట్ల విద్యార్థులను మనసిక ఒత్తిడితో ర్యాంకుల కోసం వేధిస్తున్నట్లు, అధిక ఫీజు వసూళ్ల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోని చనిపోయారని ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లిదండ్రులతో యజమాన్యాలు బేరసారాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇంటర్ బోర్డు అధికారులు వాటిపై విచారణ జరపడం లేదన్నారు. అదేవిధంగా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ కళాశాలలను ఇంటర్ బోర్డు నియంత్రించాలన్నారు. అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల పై విజిలెన్స్ దాడులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.