అసెంబ్లీలో కేవలం రూ.24 లక్షలు ఆస్తి ఉన్న MLA ఎవరంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-25 02:33:45.0  )
అసెంబ్లీలో కేవలం రూ.24 లక్షలు ఆస్తి ఉన్న MLA ఎవరంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర శాసనసభలో కోటీశ్వర్లున్నారు. రూ.100కోట్లు దాటిన వారు ఏకంగా ఏడుగురు ఉన్నారు. ప్రథమస్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ రూ.606.67కోట్లతో ప్రథమస్థానంలో ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రెండో స్థానంలో పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.461.05కోట్లు, థర్డ్ ప్లేస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.458.39కోట్లతో ఉన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రూ.211.84కోట్లు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రూ.197.12కోట్లు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రూ.109.97కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.

మాజీ సీఎం కేసీఆర్ రూ.58,93కోట్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ. 53.31కోట్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.39.55కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు రూ.24లక్షలతో అత్యంత పేదవారన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కు రూ.28లక్షలు మాత్రమే ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 119 మందిలో పీహెచ్ డీ చేసిన వారు నలుగురు మాత్రమే ఉన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు 27మంది, గ్రాడ్యుయేట్లు 42మంది, అంతకంటే తక్కువ చదివినవారు 46 మంది ఉన్నారు. 52 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నట్లు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది.

Advertisement

Next Story