- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. నిందితుడు సైఫ్ ఫోన్‌లో పోలీసులు మొత్తం 17 వాట్సప్ చాట్స్‌ను పరిశీలించారు. అనుషా, భార్గవి, ఎల్డీడీ ప్లస్ నాకౌట్స్ అనే గ్రూప్ చాట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు ప్రస్తావించారు. కాగా, రెండు అంశాల్లో ప్రీతిపై సీనియర్ సైఫ్ కోపం పెంచుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
అనస్థీషియా విభాగంలో సైఫ్ ప్రీతికి సూపర్‌వైజర్ అని.. ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడని పోలీసులు తెలిపారు. అయితే, ఈ కేసులో ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్‌ను ప్రీతి రాయగా.. సీనియర్ సైఫ్ ఆ రిపోర్ట్‌ను వాట్సప్ గ్రూపులలో షేర్ చేసి అవహేళన చేశాడని పోలీసులు వెల్లడించారు. రిజర్వేషన్‌లో ఫ్రీ సీటు వచ్చిందంటూ ప్రీతిని అవమానపరిచాడు. దీంతో ప్రీతి తనతో ఏమైనా ప్రాబ్లమా అని సీనియర్ సైఫ్‌ను ప్రశ్నించి.. ఏదైనా సమస్య ఉంటే హెచ్‌వోడీకి చెప్పాలని సైఫ్‌ను హెచ్చరించిందని తెలిపారు.
దీంతో సైఫ్ ప్రీతిపై కోపం పెంచుకుని ఆమెను వేధించాలని.. ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని భార్గవ్ అనే మరో విద్యార్థికి చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ప్రీతి సీనియర్ సైఫ్‌పై గత నెల 21వ తేదీన హెచ్‌వోడీ నాగార్జునకు ఫిర్యాదు చేసింది. విషయం పెద్దది కావడంతో ప్రీతి, సైఫ్‌కు ముగ్గురు డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చిన మరుసటి రోజు మెడికో ప్రీతి ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని పోలీసులు సైఫ్ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.