సర్కార్ కులగణన నివేదికపై ఫైర్.. MP ఆర్.కృష్ణయ్య సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
సర్కార్ కులగణన నివేదికపై ఫైర్.. MP ఆర్.కృష్ణయ్య సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే ప్రభుత్వం ఉద్యమిస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే నివేదికలో చాలా లోపాలు ఉన్నాయని ఆరోపించారు. అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని అన్నారు. కావాలనే వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు బీసీ నేతలతో తనను తిట్టించుకుని దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

ఇదిలా ఉండగా.. లోకల్ బాడీ ఎన్నిక(Local Body Elections)ల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ చట్టబద్ధతతో పనిలేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు 42శాతం సీట్లు కేటాయిస్తామని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్, బీజేపీలు సైతం 42 శాతం బీసీలకు టికెట్లు కేటాయిస్తారా? అని సీఎం రేవంత్ సవాల్ చేశారు. దీంతో ఇప్పుడు సీఎం సవాల్‌ను బీఆర్ఎస్, బీజేపీ స్వీకరిస్తుందా? బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తుందా? అన్న చర్చ నడుస్తున్నది. తాజాగా ఈ అంశంపై ఆర్.కృష్ణయ్య స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed