కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. సిట్టింగ్ ఎంపీ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. సిట్టింగ్ ఎంపీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అని గుర్తుచేశారు. అందులో నిర్లక్ష్యం చేయకుండా ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము సత్తా చాటబోతున్నామని.. డబుల్ డిజిట్ ఖాయమని జోస్యం చెప్పారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు.


ఆరు నెలలుగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ విషయం అని.. ఈ విషయంలో అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ హైకమండ్ ఆదేశాలతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story