- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెంట్రామిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదు.. MP రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత వెంకట్రామిరెడ్డిపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకట్రామిరెడ్డి ఎన్నికల్లో గెలిస్తే రూ.100 కోట్లు ఖర్చు చేస్తానని ప్రకించినట్లు గుర్తుచేశారు. అంత డబ్బు ఆయన ఎలా సంపాదించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బుల వివరాలు కూడా ప్రజలకు తెలియజెప్పాలని అన్నారు. వెంకట్రామిరెడ్డిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం బీజేపీ కార్యకర్తల కష్ట ఫలితమే బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాకపోవడానికి కారణం అన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం అయ్యాయని తెలిపారు. సుల్తానాబాద్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం అన్నారు. కాగా, పెద్దపెల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్‌లో తల్లితోపాటు నిద్రిస్తున్న ఆరేండ్ల బాలికను అదే మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న బలరాం అనే దుండగుడు సమీపంలోని పొదల్లోకి ఎత్తుకెళ్లి హత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్ చెందిన బలరాం అనే కూలీ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read...
Pawan Kalyan: పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించిన వైసీపీ కీలక నేత