- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MP Arvind: కులం పెద్దదని కేసీఆర్‌ను గెలిపించలేదు.. కులగణనపై ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో కులం కాదు గుణం ముఖ్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో కులగణన పంచాయితీ ఎక్కువైందని తెలంగాణ ప్రభుత్వం చేయించిన కులగణన ఇదో సర్వే కాదు, మన్ను కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులగణనపై ఇవాళ ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేసిన ఆయన ప్రభుత్వం కులాల వారీగా నెంబర్లు ఇంకా అధికారికంగా విడుదల చేయకముందే లీకులు ఇస్తోందని ధ్వజమెత్తారు. ఈ లీకులు రేవంత్ రెడ్డే ఇస్తున్నారా? లేక కాంగ్రెస్ తో కేసీఆర్ కలిసి ఈ లీకులు చేయిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ లీకుల్లో బీజేపీ వాళ్లు బుట్టలో పడుతున్నారు. అది వాళ్లకు తెలిసే పడుతున్నారా లేక కావాలనే చేస్తున్నారా? అని వ్యాఖ్యానించారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఈ నంబర్లు అధికారికంగా ప్రకటించమనండి. గంటల్లో అవి తప్పని నిరూపిస్తానన్నారు.
కులం పెద్దదని కేసీఆర్ ను గెలిపించలేదు:
కేసీఆర్ కులం పెద్దదని సీఎం అయ్యాడా? ఆయన కులం సంఖ్య కేవలం రాష్ట్ర జనాభాలో దాదాపు 1 శాతం ఉంటుంది. తెలంగాణ కోసం కొట్లాడారని ప్రజలు ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు. కానీ పదేళ్ల పాలన చూశాక కేసీఆర్, ఆయన పిల్లల గుణం బాగలేదనే ప్రజలు ఓడించారన్నారు. రాజకీయాల్లో నా కులం పెద్దది, నీ కులం పెద్దది అనే పంచాయతీ ఎక్కడా ఉన్నా బీజేపీలో మాత్రం ఉండకూడదని హాట్ కామెంట్స్ చేశారు. నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక దేశవ్యాప్తంగా ఐయామ్ ఏ హిందూ నేషనల్ అని హోర్డింగ్ లు వెలిశాయని గుర్తు చేశారు. బీజేపీలో పని చేయాలన్నా, ఈ దేశం కోసం పని చేయాలన్నా బీజేపీలో నా కులం హిందుత్వం, నా కులం భారతీయ తత్వం అనేది ఉండాలని బీజేపీలో ఎవరైనా సరే కులాల గురించి మాట్లాడితే అధిష్టానం దాన్ని సహించకూడదన్నారు. ఢిల్లీలో సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఆజాది అన్నవాళ్లందరినీ హిందువులంతా ఏకమై బుద్ధి చెప్పారన్నారు.
రేవంత్ రెడ్డి లెక్కన రాష్ట్ర జనాభాలో వారు లేరా?:
కులణగనపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల లెక్కలు చెప్పారు. కానీ క్రిస్టియన్స్ వివరాలు చెప్పలేదు. రేవంత్ రెడ్డి లెక్కన రాష్ట్రంలో క్రిస్ట్రియన్స్ లేరా అని అర్వింద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చెప్పిన కులగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3,54,75,554 ఉంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఓటర్ల సంఖ్య 3,35,27,925 ఉంది. సుమారు 19-20 లక్షల మంది నాన్ ఓటర్లు ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ ప్రకారం 0-6 సంవత్సరాలు వయసు కలిగిన వారు 39 లక్షల మంది ఉన్నారని విమర్శించారు.