- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో మొగోడు దొరకలేదా? ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్!
దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ ఫస్ట్ లిస్టుపై తెలంగాణలో అసమ్మతి రాజుకుంటోంది. నిన్న ప్రకటించిన 9 మంది జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా.. నలుగురు కొత్తవారికి చోటు కల్పించింది. హైదరాబాద్, మల్కాజిగిరి, జహీరాబాద్, నాగర్ కర్నూల్ స్థానాల్లో పార్టీ కీలక నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఆశించినట్లు వార్తలు వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించడానికి మొగోడు దొరకలేదా? అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. ఇప్పటికీ పార్టీలో చేరని మాధవీలతకు సీటు కేటాయించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. బీజేఎల్పీ నేత అవకాశం దక్కకపోవడంతో ఇప్పటికే రాజాసింగ్ విజయ సంకల్ప యాత్రతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు టాక్ వినిపిస్తోంది.
కాషాయ దళంలో అసమ్మతి గళం!
మరోవైపు మల్కాగిజిగిరి ఎంపీ టికెట్ ఆశించిన పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానంటూ సంచలన ట్వీట్ చేశారు. ఆయన ఈటలకు సహకరిస్తారా.. ? లేదా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొన్నది. అలాగే నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాన్ని ఆశించిన బీజేపీ నేత బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి నిరాశకు గురైనట్టు తెలుస్తోంది.
9 మందిలో ఆరుగురు వలస నేతలే..
జహీరాబాద్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు ఇవ్వగా ఆలె నరేంద్ర కుమారుడు ఆలె భాస్కర్, మాజీమంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి తీవ్ర రాష్ట్ర నాయకత్వం వద్ద నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా మొదటి జాబితాలో పేర్లు రాకపోవడంతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సహా నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి నిరాశలో ఉన్నారు. మరోవైపు మొత్తం 9మంది జాబితాలో ఆరుగురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడం చర్చకు దారితీసింది.