ఎంఐఎంపై మరోసారి MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
ఎంఐఎంపై మరోసారి MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీలో భారీ ఎత్తున నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూడటంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ స్కామ్‌లో ఎంఐఎం పార్టీ ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీలోనే ఎక్కువగా బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఇందులో టెర్రరిస్టులు కూడా ఉండొచ్చన్న అనుమానాలు రాజాసింగ్ వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. 27 వేల బర్త్ సర్టిఫికెట్లు అన్ని ఓల్డ్ సిటీ పరిధిలోనే ఉన్నాయని వీటిని ఎంఐఎం నేతలు దగ్గరుండి ప్రోత్సహించారని ఆరోపించారు.

ఈ సర్టిఫికెట్స్ పొందిన వారిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన వారు ఉన్నారు. అసలు టెర్రరిస్టులు ఎందరు ఉన్నారో నిగ్గు తేల్చాలని అన్నారు. ఇందుకోసం సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా అసలు ఎన్ని ఓటర్, రేషన్ కార్డులు ఉన్నయో కూడా లెక్క తేల్చాలన్నారు. కాగా జీహెచ్ఎంసీ లో సరైన పత్రాలు లేకుండానే 31 వేల సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ జనన, మరణ పత్రాలను ధ్రువీకరణ విభాగం జారీ చేసిన విషయం వెలుగు చూసింది. ఈ తతంగం వెనుక భారీ స్కామ్ ఉందని ఏఎంసీఏ, ఎంఓహెచ్, ప్రధాన కార్యాలయంలోని కీలక అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బాగోతంపై విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed