- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ 26 పార్టీల నేతలు దేశ ద్రోహులే: MLA Raghunandan Rao సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు జతకట్టిన ప్రతిపక్షాల కూటమి ఇండియాపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న బెంగళూరులో సమావేశం అయిన 26 పార్టీల వారు దేశ ద్రోహులే అని కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఏ పేరుతో గతంలో రెండు సార్లు ఓడిపోయారని.. ఇప్పుడు ఇండియా పేరు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లతో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. మోడీ మూడవ సారి భారత ప్రధాని అవుతారని దీమా వ్యక్తం చేశారు. కాగా, మంగళవారం కర్నాటక రాజధాని బెంగళూరులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు ప్రణాళికలు రచించేందుకు 26 పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షత వహించగా.. ఏఐసీసీ ప్రెసిడెండ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎంలు మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, సిద్ధారామయ్య తదితర నేతలు పాల్గొన్నారు.