ఫోన్లు ట్యాప్ చేసే పరికరాల ఖర్చు వారిదే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఫోన్లు ట్యాప్ చేసే పరికరాల ఖర్చు వారిదే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించడంతో ఒక్కసారిగా ఈ కేసు సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆయన అంగీకరించారు. అంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనలతోనే చేసినట్లు వెల్లడించారు. తాజాగా.. ఈ కేసులపై కాంగ్రెస్ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్ష నేతలవే కాకుండా సొంత ఎమ్మెల్యేల ఫోన్లను కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారని ఆరోపించారు. ఒక్కొక్కటిగా బాగోతాలు బయటకు వస్తుండటంతో నీళ్లు మింగుతున్నారని విమర్శించారు. వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేయించారని అన్నారు. ట్యాప్ చేయడానికి వాడే పరికరాలను విదేశాల నుంచి తెప్పించారని వెల్లడించారు. ఆ పరికరాల ఖర్చు మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలదే అన్నారు.

Advertisement

Next Story

Most Viewed