Breaking: పద్మ పురస్కారాలపై నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-01-19 10:13:52.0  )
Breaking: పద్మ పురస్కారాలపై నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పద్మ పురస్కారాల(Padma Awards)పై సీనియర్ నటుడు నరేశ్(Actor Naresh) సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం, నాటి హీరో నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao)కు భారత‌రత్న(Bharata Ratna), సీనియర్ నటి, నిర్మాత విజయ నిర్మల(Vijaya Nirmala)కు పద్మ పురస్కారం రావాలని ఆయన కోరారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయనిర్మల అని గుర్తు చేశారు. తన అమ్మకు అవార్డు రావాలని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేశానని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పురస్కారం కోసం సిఫారసు చేశారని చెప్పారు. అయినా తన అమ్మ విజయ నిర్మలకు అవార్డు రాకపోవడం బాధాకరమన్నారు. టాలీవుడ్‌(Tollywood)లో ఎంతో మంది పద్మ అవార్డులకు అర్హత కలిగి ఉన్నారన్నారు. తెలుగువాళ్లకు అవార్డులు రావాలని కోరుతూ నిరాహార దీక్ష చేసినా తప్పులేదని నరేశ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story