Seethakka: మహిళల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
Seethakka: మహిళల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలందరూ ఒకే కుటుంబంలా తలపించేలా చీరల పంపిణీ(Distribution Of Sarees) అని పంచాయితీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు చీరన పంపిణీపై ట్విట్టర్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఇందులో 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా చీరలు(Free Sarees) అని, ప్రతీ మహిళకు రెండెసి చీరల చొప్పున పంపిణీకి సర్కారు నిర్ణయించిందని తెలిపారు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఎస్‌‌హెచ్‌జీ(SHG) సభ్యులకు తొలిసారి చీరల పింపిణీ జరుగుతున్నట్లు చెప్పారు. అలాగు సోలార్ విద్యుత్ ప్లాంట్లు(Solar Power Plants), ఆర్టీసీ అద్దె బస్సులు(RTC Rental Buses) మహిళలకు కేటాయింపు అని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంతేగాక వన్ కార్పోరేట్ వన్ విలేజ్ ఎడాప్షన్ గొప్ప నిర్ణయమని, కార్పొరేట్లు పల్లె ప్రాంతాల అభివృద్ది కోసం పని చేయాలని, కార్పొరేట్లకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తున్న నిర్మాణ్ సంస్థకు అభినందనలు తెలిపారు. ఇక దీనిపై ప్రజాప్రభుత్వం హయాంలో మొదటి ఏడాదిలోనే మహిళల కేంద్రంగా ఎన్నో సంస్కరణలు చేశామని, నిజమైన ఆర్ధిక శ్వేచ్ఛ ప్రారిశ్రామికవేత్తలుగా మార్పు దిశగా ప్రజాపాలన పని చేస్తోందని సీతక్క రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed