- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి.. కవితకు మరిన్ని చిక్కులు తప్పవా?
దిశ,డైనమిక్ బ్యూరో: రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి తాజాగా అప్రూవర్ గా మారారు. అప్రూవర్ గా మారిన తర్వాత రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో సెక్షన్ 164 కింద శరత్ చంద్ర రెడ్డి వాగ్మూలం ఇచ్చారు. శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా రికార్డు చేశారు. కాగా గతంలో ఈడీ కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రా రెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసూలోనూ అఫ్రూవర్ గా మారారు. కాగా ఇదే కేసులో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరుపరిచిన తర్వాత శరత్ చంద్ర రెడ్డిని కవిత బెదిరించినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. శరత్ చంద్రా రెడ్డి దక్కించుకున్న ఐదు జోన్లకు ఒక్కొక్క జోన్ కి రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. రూ.25 కోట్లు ఇచ్చేందుకు శరత్ చంద్ర రెడ్డి నిరాకరించడంతో కవిత బెదిరించినట్లు సీబీఐ చెప్పింది. కవితను రెండు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత ప్రత్యేక కోర్టు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ కి పంపింది. జ్యుడీషియల్ రిమాండ్ కి ఇచ్చిన నాలుగు రోజుల్లో సీబీఐ కేసులో అప్రూవర్ గా శరత్ చంద్ర రెడ్డి స్టేట్ మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.
కాగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. ఈకేసులో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కేవలం కొంత మంది స్టేట్ మెంట్ ఆధారంగా తనను అరెస్ట్ చేశారని కవిత ఆరోపిస్తోంది. మరో వైపు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీ పెద్దఎత్తున బీజేపీకి పొలిటికల్ బాండ్స్ రూపంలో డబ్బు చెల్లించిందని ఆమ్ ఆద్మీ ఆరోపిస్తోంది. ఇటువంటి తరుణంలో అఫ్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి ఏం స్టేట్ మెంట్ ఇచ్చారు? దాంతో ఎవరికి చిక్కుముడి పడబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.
Read More...
కేసీఆర్ బయటకు వస్తే మా అస్త్రాలను బయటకు తీస్తాం.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు