- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కంటనీరు ఆగడం లేదు.. కాంగ్రెస్ MLA జగ్గారెడ్డి ఎమోషనల్

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వరుస ఆత్మహత్యలపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చలించారు. ఆత్మహత్యలపై స్పందిస్తూ.. ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ''కష్టాలు, బాధలు సహజం. వస్తుంటాయి. .పోతుంటాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్నామని వ్యక్తి కానీ, కుటుంబం సభ్యులు కానీ ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు సమంజసం. ఆత్మహత్య చేసుకుంటే బాధతో అందరం ఏడుస్తాము. ఆ కుటుంబం కానీ, వ్యక్తి కానీ ఆత్మహత్య చేసుకోకుండా ఆర్థికంగా మనలో ఎవరైనా అదుకుంటే ఎవరూ ఏడవాల్సిన అవసరం ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకునే వారు ఎందుకు వారి బంధువులు, సన్నిహితులు, స్నేహితులకు తమ పరిస్థితిని చెప్పుకునే ప్రయత్నం చేయడం లేదు. చెప్పుకుంటే ఎక్కడో ఓ చోట పరిష్కారం దొరుకుతుంది. ఈ భూమి మీద అద్భుతమైన సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ఆదుకునే వారూ ఉంటారు. పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకుని మళ్ళీ తిరిగి భూమ్మిదికి రారు. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఓ మిత్రుడి మంచి సలహా ప్రాణాలను నిలబెట్టొచ్చు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఇది ఆత్మహత్య చేసుకునే ఒక్క క్షణం ముందు ఆలోచించాలి. ఇటీవల వెలుగు చూస్తున్న ఆత్మహత్య ఘటనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇది మంచిపరిణామం కాదు. వద్దు ఎవరూ ఆత్మహత్య నిర్ణయం తీసుకోవద్దు. వరుస పరిణామాలు చూసి ఈ మెసేజ్ చేస్తున్నాను. దీనికి కొనసాగింపుగా నా జీవితంలో జరిగిన ఒక వాస్తవ సంఘటనకు సంబంధించిన ఒక వీడియోను రెండు రోజుల్లో విడుదల చేస్తాను.'' అని పేర్కొన్నారు.