- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Sangareddy: సింగూరు ప్రాజెక్టులో బోటింగ్..! మంత్రి దామోదర్ కీలక ఆదేశాలు

దిశ, వెబ్ డెస్క్: సింగూరు ప్రాజెక్టు(Singuru Project)లో బోటింగ్(Boating) ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Health Minister Damodar Rajanarsimha) ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District), పుల్కల్ మండలం లోని సింగూరు ప్రాజెక్ట్ ను సందర్శించిన ఆయన.. పర్యాటకంగా(Tourist Attraction) అభివృద్ధి చేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన.. పర్యాటకుల సౌలభ్యం కోసం 50 సీట్ల సామర్థ్యంతో నడిచే రెండు అధునాతన బోట్లు(Boats), స్పీడ్ బోట్స్(Speed Boats)ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అలాగే సింగూర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్(Master Plan), రోడ్ మ్యాప్(Road Map) ను రూపొందించాలని టూరిజం, ఇరిగేషన్, R&B శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతేగాక సింగూరు జలాశయంలో ఉన్న ఐ ల్యాండ్ లో వాచ్ టవర్ పైన రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రెన్స్ ప్లే ఏరియా, ల్యాండ్ స్కేపింగ్, ఆర్ట్ స్కెపింగ్, గార్డెనింగ్ లను రూపొందించాలని సూచించారు. ఇక సింగూరు ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ ఆద్వర్యంలో 29 ఎకరాల్లో సుమారు 5 కోట్ల రూపాయలతో రెస్టారెంట్, 25 ఆధునిక కాటేజీల నిర్మాణం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్ట్, గార్డెనింగ్, గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.
అలాగే ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో సింగూరు డ్యాం పైనా బీటీ రోడ్డు నిర్మాణం, పర్యాటకుల సౌకర్యం కోసం డ్యాం పైకి వెళ్లడానికి అవసరమైన స్టెప్స్ నిర్మాణం, డ్యాం బండ్ వెంట పార్కు అభివృద్ధి, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ కు అవసరమైన ప్రతిపాదనలను ఫిబ్రవరి మొదటి వారం లోపు రూపొందించాలని అధికారులతో అన్నారు. సింగూరు ప్రాజెక్టు దర్శించేందుకు వచ్చే పర్యాటకుల సౌలభ్యం కోసం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని, R&B శాఖ ఆధ్వర్యంలో పెద్దారెడ్డిపేట క్రాస్ రోడ్డు(PeddaReddy Peta Cross Road) నుండి సింగూరు డ్యామ్ వరకు వచ్చే రోడ్డును 4 లేన్ల రహదారులుగా విస్తరణ పనులు, అధునాతన లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని దామోదర స్పష్టం చేశారు.