Sama: దొంగల పాలనకు, ప్రజా పాలనకు తేడా ఇదే.. సామా రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
Sama: దొంగల పాలనకు, ప్రజా పాలనకు తేడా ఇదే.. సామా రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: నాటి బీఆర్ఎస్ దొంగల పాలన(BRS Thieves Rule)కు నేటి ప్రాజా పాలన(Peoples Rule)కు తేడాకు ఇదే నిదర్శనం అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్(Congress Media Committee Chairman) సామా రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) విమర్శలు చేశారు. సీఎంఆర్ఎఫ్(CMRF) ఫండ్స్ రిలీజ్ చేయడంలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రికార్డ్(Record) సాధించారని, ఏడాదిలోనే 830 కోట్లు సాయం విడుదల చేశారని వచ్చిన వార్తపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బీఆర్ఎస్ పాలన పై మండిపడ్డారు.

దీనిపై నాడు సీఎంఆర్ఎఫ్ అంటే పేద వారి ఆరోగ్యం పేరు మీద కూడా పైసలు దిగమింగిన బీఆర్ఎస్ అవినీతి పందికొక్కుల పాలన చూశామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే నేడు సీఎంఆర్ఎఫ్ అంటే పారదర్శకతతో పుట్టు చెవుడు, మూగ పిల్లల జీవితాల్లో వెలుగునిస్తూ.. పేద గుండెలు కాపాడే ఇంటి పెద్దన్న భాధ్యత చూస్తున్నామని సామా రామ్మోహన్ అన్నారు. కాగా ఏడాది కాలంలో సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ విడుదల చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రికార్డ్ నెలకొల్పారు. గతంలో సగటున ఏడాదికి 480 కోట్లు విడుదల చేయగా.. కాంగ్రెస్ పాలనలో ఈ ఏడాది 830 కోట్ల రూపాయలను బాధితులు చెక్కుల రూపంలో అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed