శభాష్ పోలీస్.. మతిస్థిమితం లేని మహిళను కాపాడిన బ్లూ కోర్ట్, ఫైర్ సిబ్బంది..

by Kavitha |
శభాష్ పోలీస్.. మతిస్థిమితం లేని మహిళను కాపాడిన బ్లూ కోర్ట్, ఫైర్ సిబ్బంది..
X

దిశ, హుజురాబాద్ రూరల్: మతిస్థిమితం సక్రమంగా లేక బావిలోకి దూకిన మహిళను పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన హుజురాబాద్ మండలంలోని సిర్పపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు..

మండలంలోని సిర్సపల్లి గ్రామానికి చెందిన మన్యాల శారద (45) అనే మహిళ కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయింది . కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తూ ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రమాదవశాత్తు వారి ఇంటి సమీపంలోనే ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులోకి దూకింది. బావిలో నిండుగా నీళ్ళు ఉండడంతో చెట్ల కొమ్మలను పట్టుకుని వేలాడింది. వెంటనే గుర్తించిన స్థానికులు 100 కాల్‌తో పాటు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. బ్లూ కోర్టు సిబ్బంది రఫీ, సత్యంతో పాటు ఫైర్ సిబ్బంది శ్రీనివాస్, ప్రభాకర్, సందీప్, అనిల్ కుమార్, శివారెడ్డిలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బావిలో చెట్ల కొమ్మలను పట్టుకుని వేలాడుతూ ఉన్న మతిస్థిమితం లేని మహిళను తాళ్ల సహాయంతో ప్రాణాలకు తెగించి బావిలోకి దిగి పైకి లాగి రక్షించారు. అనంతరం మహిళను తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు సురక్షితంగా బయటపడింది. సమాచారం అందగానే వెంటనే స్పందించి గ్రామానికి చేరుకొని మతిస్థిమితం లేని మహిళను బావిలో నుంచి కాపాడిన బ్లూ కోట్ పోలీసులను, ఫైర్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.

Advertisement

Next Story