ఇదెక్కడి న్యాయం.. ఆర్టీసీకి లాభాలు వస్తేనే జీతాలు పెంచుతారా?

by GSrikanth |
ఇదెక్కడి న్యాయం.. ఆర్టీసీకి లాభాలు వస్తేనే జీతాలు పెంచుతారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ లాభాలు వస్తేనే కార్మికులకు వేతనాలు పెంచుతామని స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పడం విచిత్రంగా ఉన్నదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ కే.రాజిరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదెక్కడి న్యాయం? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఎమ్మె్ల్సీ జీతాలు ఎలా పెంచారు? అంటూ ఫైర్​అయ్యారు. ప్రభుత్వం ఆర్టీసీకి బడ్జెట్‌లో పెట్టిన రూ.1500 కోట్లు ఏ మూలకూ రావాని తేల్చి చెప్పారు.

ఆర్టీసీ కార్మికులకు ఇప్పటివరకు 2 పే స్కేల్స్ పెండింగ్‌లో ఉన్నాయని, అనేకమార్లు రిక్వెస్ట్​చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, అజయ్‌లు ఆర్టీసీకి అనేక హామీలు ఇచ్చి మరిచారన్నారు. ఇక ఎలక్ట్రిక్ బస్సులు, స్లీపర్ బస్సులతో ఆర్టీసిలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్‌ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed