- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSRTC: ఏపీకి ఆర్టీసీ స్లీపర్ బస్సులు.. రూట్‌లివే!(వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రయాణీకుల సౌకర్యార్థం రాష్ట్రంలో తొలిసారి టీఎస్‌ఆర్టీసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొట్టమొదటి సారిగా 10 బస్సులు అందుబాటులోకి రాగా.. వీటిలో 4 స్లీపర్, మరో 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులను టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించబోతుంది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా అత్యాధునిక హంగులతో రూపొందించిన ఈ బస్సులు బుధవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్-కాకినాడ, హైదరాబాద్-విజయవాడ మార్గాల్లో ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడపనుంది. వీటిని హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ బస్టాప్ దగ్గర ఈరోజు సాయంత్రం 4 గంటలకు టీఎస్‌ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభిస్తారు.
బస్సు ప్రత్యేకతలివే..!
స్లీపర్ బస్సుల్లో లోయర్ బెర్తులు 15, అప్పర్ బెర్తులు 15 ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. సీటర్ కమ్ స్లీపర్ బస్సుల్లో 15 అప్పర్ బెర్తులతో పాటు లోయర్ లెవల్‌లో 33 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ప్రతి బస్సుకు ఎయిర్ సస్పెన్షన్ సదుపాయం, వైఫై సదుపాయాన్ని కల్పించారు. అంతేకాకుండా, ఒక వాటర్ బాటిల్‌తో పాటు ఫ్రెష్‌నర్‌ను ఉచితంగా అందజేస్తారు. తమ లగేజీ లోడింగ్, అన్‌లోడింగ్‌కు అటెండెంట్లు సహకరిస్తారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు విశాలంగా బెర్త్‌లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
బస్సుల టైమింగ్స్..
కాకినాడ వైపు వెళ్లే బస్సులు హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. ప్రతి రోజు రాత్రి 07.45, 8.30 గంటలకు నడుస్తాయి. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు రాత్రి 7.15 గంటలకు, 7.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి. విజయవాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజూ మియాపూర్ నుంంచి ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15, మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి.
Read More...
కుప్పం చంద్రబాబు పర్యటనకు వెళ్లే వారికి పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్.. రోడ్ షో కి వెళ్తే కేసులు నమోదు