మీ బతుకులు ‘యూటర్న్’ అవుతాయి జాగ్రత్త! సజ్జనార్ ట్వీట్ వైరల్

by Nagaya |
మీ బతుకులు ‘యూటర్న్’ అవుతాయి జాగ్రత్త! సజ్జనార్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా చాలామంది వాహనదారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. తనకు కనిపించేందే దారి.. మా రూటే సరరేటు అంటూ అడ్డదిడ్డంగా వాహనాలను నడుపుతున్నారు. ముఖ్యంగా ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంలో ముందుంటున్నారు. పోలీసులు రోజుకు కొన్ని వేల మందికి ఫైన్లు వేసి ముక్కు పిండి చలాన్లు వసూలు చేస్తున్నా ఇలాంటి డ్రైవింగ్ సెన్స్ లేని వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌తోపాటు యూటర్న్‌ల వద్ద ఇష్టానూసారంగా వస్తూ ఇతరుల ప్రాణాలను తీస్తు్న్నారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన డ్రైవింగ్‌తో ఇద్దరు బైకర్స్ ప్రమాదం బారిన పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. దానిలో ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్ రూట్‌లో వెళ్తూ రోడ్డుక్రాస్ చేయబోయాడు. అదే సమయంలో ఎదురుగా ఇద్దరు బైకర్స్ వస్తూ రాంగ్ రూట్ వెహికిల్‌ను తప్పించబోయి పక్కన్నే ఉన్న కిరణ షాపు మెట్లను ఢీకొట్టి ఎగిరి కిందపడిపోయాడు. దీంతో వెనక నుంచి వస్తున్న మరో బైక్‌ కిందపడిపోయిన బైక్‌ను తగిలి అతడు కూడా కిందపడిపోయాడు. ఇద్దరు వ్యక్తులు కిందపడిపోయినా తనకేం సంబంధం లేదన్నట్లు రాంగ్ రూట్‌లో వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఈ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్.. ‘‘యూటర్న్‌ల వద్ద అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం డేంజర్! మీతో పాటు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడతారు. జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి.’’ అని క్యాప్షన్ ఇచ్చారు.

Advertisement

Next Story