ఆర్టీసీ యాజమాన్యం వేధింపులతోనే నమ్మె నోటీసులు : టీజీ ఆర్టీసీ జేఏసీ

by M.Rajitha |
ఆర్టీసీ యాజమాన్యం వేధింపులతోనే నమ్మె నోటీసులు : టీజీ ఆర్టీసీ జేఏసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను చిన్నచూపు చూస్తూ, హక్కులను కాలరాస్తూ, అణచివేతలకు గురిచేయడంతోనే సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​ఈదురు వెంకన్న తెలిపారు. మంగళవారం వైస్ ఛైర్మన్ ఎం. థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి. మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్యతో కలిసి జీడిమెట్ల డిపోలో నిర్వహించిన సమ్మె సన్నాహాక సమావేశానికి హాజరైయ్యారు. ఈసందర్బంగా మాట్లాడుతూ నమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఆర్టీసి యాజమాన్యం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి మాటలు వినే స్థితిలో ఆర్టీసి కార్మికవర్గం లేదని, సమ్మె చేయడానికే సిద్ధపడుతున్నారని తెలిపారు. జీడిమెట్ల డిపో మేనేజర్ చట్టవిరుద్ధంగా అధిక పని గంటల ద్యూటీలు చేయిస్తూ వారిని కట్టు బానిసలుగా చేసి వెట్టిచాకిరీ చేయిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే డిపో మేనేజర్ ఈ విధానాలకు స్వస్తి చెప్పి ఎంటిడబ్ల్యు యాక్ట్ ప్రకారంగా డ్యూటీ ఛార్టులను వేయాలని, రూట్ సర్వే ప్రకారం రన్నింగ్ టైమ్ ఫిక్స్ చేసి 141 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే ఎన్నికల కోడ్ సాకుతో కార్మిక సంఘాలతో చర్చలకు రాకుండా తప్పించుకున్న యాజమాన్యం అదే ఎన్నికల కోడ్​లో అవుట్ సోర్సింగ్ పేరుతో డ్రైవర్ నియామకాలను ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఆ నియామకాలను వెంటనే రద్దు చేయడానికి ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆర్టీసి యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలను ముఖ్యమంత్రి పరిశీలించి ఆర్టీసి అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి, ఆర్టీసి కార్మికులకు మధ్య దూరం పెంచేందుకు ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ తప్పుడు నివేదికలు ప్రభుత్వానికి అందిస్తున్నారని, దీంతోత ప్రభుత్వానికి అపకీర్తి వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి వెంటనే ఆర్టీసి సమ్మె పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుని జెఎసి నాయకులను చర్చలకు పిలిచి సామరస్య పూర్వకంగా కార్మికుల సమస్యలను పరిష్కరింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.వెంకటి గౌడ్, ఎన్.కమలాకర్ గౌడ్, విబాబు, హరికిషన్, డేనియల్, గోవర్ధన్, చంద్రకాంత, అంజలి, అరుణ, అనిత, పాషా, జ్ఞానేశ్వర్, ఎల్.ఎస్.రావు, సైదులు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed