- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RTC: హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లాలనుకునే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్: గత వారం రోజులుగా శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరడంతో డ్యాం పూర్తి స్థాయిలో నిండుకుంది. అలాగే ఎగువ నుంచి ఫ్లోటింగ్ పెరగడంతో సాగర్ డ్యామ్ అధికారులు సోమవారం ఉదయం ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే మంగళవారం తెల్లవారుజామున సాగర్ డ్యాం పూర్తి స్థాయిలో నిండటంతో 20 గేట్లను ఎత్తారు. దీంతో సాగర్ సోయగాలను చూసేందుకు వెళ్లే పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. అయితే హైదరాబాద్ మహానగరం నుంచి శ్రీశైలం కంటే సాగర్ దగ్గర కావడంతో పర్యటకులు ఎక్కువగా సాగర్ వెళ్లడానికి ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి టీజీ ఆర్టీసీ శుభవార్త అందించింది.
నగరంలోని ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి నేరుగా సాగర్ కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. నల్గొండ డిపో ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సర్వీసులు.. ఉదయం 5 గంటలకు, 6.45 నిమిషాలకు, 7. 15, 7.30, 8 గంటలు, 9.45, 10.45, మధ్యాహ్నం 2.30 గంటలకు అలాగే సాయంత్రం 5 గంటలకు, 5.40 నిమిషాలకు బస్సులు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి నేరుగా డీలక్స్ బస్సులు సాగర్ వెళ్లనున్నాయి. దీంతో సాగర్ వెళ్లాలనుకునే సందర్శకులు టీజీ ఆర్టీసీ సేవలను వినియోగించుకుని సుఖ, సురక్షిత ప్రయాణం చేయాలని ఆర్టీసీ అధికారులు కోరారు.