- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే రోజు 3 పరీక్షలు ఎలా రాస్తారు.. పరీక్ష తేదీలు మార్చాలని ఆర్ఎస్పీ డిమాండ్
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లలో మూడు పరీక్షలను ఒకే తేదీన నిర్వహించడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయమై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏప్రిల్ 30వ తేదీన (ఒకే రోజు) నిర్వహించే మూడు పరీక్షలు నిరుద్యోగులు ఎలా రాస్తారు? అని ప్రశ్నించారు. అందులోను నిర్వహించే మూడు పరీక్షలకు (పోలీసు కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, జూనియర్ లైన్‌మెన్) ఒకటే క్వాలిఫికేషన్ ఉందని మండిపడ్డారు. ఒకే క్వాలిఫికేషన్‌తో అర్హులయ్యే మూడు పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు నిర్వహించడం అన్యాయమన్నారు. నిరుద్యోగ జీవితాలతో ఆడుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షల తేదీలను వెంటనే మార్చాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
Advertisement
- Tags
- RSP
- govt exams
Next Story