నేటి నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర.. అక్కడినుంచే ప్రారంభం

by GSrikanth |   ( Updated:2023-02-06 02:30:39.0  )
నేటి నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర.. అక్కడినుంచే ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో/వరంగల్ బ్యూరో: హాథ్ సే హాథ్ జోడో అభియాన్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మానిక్ రావు థాక్రే తెలిపారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. యాత్రలో టీపీసీసీ చీఫ్ తోపాటు ముఖ్య నాయకులు పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంతోపాటు ప్రతి ఇంటికి హాథ్ సే హాథ్ జోడో పోస్టర్ ను అంటిస్తామన్నారు.

పూజల అనంతరం..

హథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి ప్రారంభం కానున్నది. ముందుగా ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 11 గంటలకు సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 12 గంటలకు పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర చేస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 2:30 వరకు భోజన విరామం ఉంటుంది. 2:30 గంటలకు పాదయాత్ర షురూ చేసి సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామానికి చేరుకుంటారు. పస్రా జంక్షన్ లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ ను నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పస్రా నుంచి పాదయాత్ర మొదలు పెట్టి రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకొని అక్కడే రేవంత్ బస చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి మల్లు రవి, ఇతర ముఖ్య నాయకులు ములుగు చేరుకొని పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు.

వివిధ కమిటీలతో భేటీ..

మాణిక్ రావు థాక్రే ఇప్పటికే ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్, టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ నూతి శ్రీకాంత్, వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ తో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించారు.

Also Read..

నేడే రాష్ట్ర బడ్జెట్: అసెంబ్లీలో హరీశ్‌రావు.. కౌన్సిల్‌లో ప్రశాంత్‌రెడ్డి

Advertisement

Next Story