BRS సర్కార్ బీసీలకు చేసింది శూన్యం.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

by Satheesh |   ( Updated:2023-10-03 15:18:57.0  )
BRS సర్కార్ బీసీలకు చేసింది శూన్యం.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీసీ జనగణన చేపట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు ఎంతో చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప బీఆర్ఎస్ సర్కార్ బీసీలకు చేసింది శూన్యం అని.. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్న మాట ఉత్తముచ్చటగా మిగిలిపోయిందని ఆరోపించారు. బీసీ జనగణన డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి మంగళవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించిన ఇండియా కూటమిలోని భాగస్వాములైన జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన నితీశ్ కుమార్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో బీసీ జనగణనను విజయవంతంగా చేపట్టి ఆ వివరాలను కూడా విడుదల చేసిందని పేర్కొన్నారు.

జనాభా దామాషా ప్రకారం బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా వారికి న్యాయంగా దక్కాల్సిన వాటా కావాలంటే బీసీ జనగణనతోనే సాధ్యమవుతందని.. అందువల్ల తెలంగాణలోనూ బీసీ కుల గణన చేపట్టడంతో పాటు 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మీ పాలనలో ప్రభుత్వంలోనే కాకుండా కేవలం 20 సీట్లు మాత్రమే ఇచ్చి రాజకీయంగా కూడా బీసీలను అణగదొక్కలనే కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీ జనగణన డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని బీసీనని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మోదీ కూడా బీసీల న్యాయమైన డిమాండ్‌ను నేరవేర్చడానికి చొరవ చూపకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.

Advertisement

Next Story