- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎంపీ కోమటిరెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ
దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇరువురు నేతలు పార్టీలో చేరికలపై మంతనాలు జరిపారు. భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చేరికలపై పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు వెళ్తాం అన్నారు. కోమటిరెడ్డి తాను కలిసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామన్నారు.
కోమటిరెడ్డి, ఉత్తమ్, జానారెడ్డిలను సంప్రదించకుండా పార్టీలో చేరికలు జరగలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 15 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. చాలా మంది కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డితో రోజు మాట్లాడతానన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి జూపల్లి ఇంటికి బయలు దేరి వెళ్లారు.
Also Read..
Revanth Reddy: పోటీ చేసే స్థానం ఇదే.. సోదరుడు తిరుపతి రెడ్డి క్లారిటీ