- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MP లక్ష్మణ్, మంత్రి కిషన్ రెడ్డి వస్తే.. కలిసి ఆ పని చేద్దాం: రేవంత్ రెడ్డి
by Satheesh |

X
దిశ, డైనమిక్ బ్యూరో: భజరంగ్ దళ్ నేతలు గాంధీ భవన్ ముట్టడిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. హనుమాన్ చాలీసా చదవడానికి మాకేం అభ్యంతరం లేదని, మేము హిందువులం సంతోషంగా హనుమాన్ చాలీసా చదువుతామని అన్నారు. ఒక వేళ గాంధీభవన్‌కు ఎవరైనా వస్తే మెట్లపైన భజన చేయిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. 40 శాతం కమీషన్ల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలాంటి నినాదాలు ఇస్తుందన్నారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి వస్తే హనుమాన్ చాలీసా కలిసి చదువుకుందామని పిలుపునిచ్చారు. కానీ హనుమాన్ చాలీసా చదువుకోవాల్సింది.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అని విమర్శించారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ నేతలు ఎంఐఎంతో కలిసిపోయారని ఆరోపించారు.
Next Story