మైనారిటీలకు రేవంత్ అన్యాయం చేసాడు : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ

by M.Rajitha |
మైనారిటీలకు రేవంత్ అన్యాయం చేసాడు : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి పాలనలో మైనారిటీలకు అన్యాయం జరిగిందని.. రేవంత్‌రెడ్డి వచ్చాక ఒక్క రూపాయి కూడా మైనారిటీలకు సబ్సిడీ ఇవ్వలేదని మాజీమంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఉర్దూ డీఎస్సీ నిర్వహించడం లేదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ మైనారిటీలకు సబ్సిడీ ఇచ్చారని తెలిపారు. ఆర్టీసీలో సీనియర్ సిటిజన్స్‌కు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని.. మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. అలాగే.. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని.. వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తామని చెప్పారని.. మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించి మర్చిపోయారని పేర్కొన్నారు. మైనార్టీల ఓట్లు వేయించుకొని మోసం చేశారని తెలిపారు. మైనారిటీ విద్యార్థులకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో ప్రోత్సాహకాలు ఇస్తామని అమలు చేయడం లేదన్నారు. రేవంత్‌ ఆర్ఎస్ఎస్‌లో పని చేశారని.. ఆయన గురువు చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీనా లేదా అనేది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది రేవంత్ రెడ్డి పాలనలా కాకుండా మోడీ పాలనలా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి మోడీ, అమిత్‌షాను ఫాలో అవుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో పథకాలు అమలు చేస్తున్నామని హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని.. అయినా నమ్మకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని పేర్కొన్నారు.


Next Story

Most Viewed