టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో 21 మంది అభ్యర్థులు

by Javid Pasha |   ( Updated:2023-02-27 15:44:59.0  )
టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో 21 మంది అభ్యర్థులు
X

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో ఏర్పాటైన టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి బరిలో 21 మంది అభ్యర్థులున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం వరకు గడువు ఉండటంతో, నిర్ణీత గడువులోపు ఎవరు కూడా నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ముందుకు రాకపోవటంతో పోటీకి అర్హతగా నిలిచిన 21 మంది ఎన్నికల బరిలో నిలచినట్లు ఆమె వెల్లడించారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 వరకు పోలింగ్, 16 న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

హైదరాబాద్ లోకల్ అథారిటీ ఏకగ్రీవం

హైదరాబాద్ లోకల్ అథారిటీ ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవమైంది. ఈ స్థానానికి మజ్లీస్ పార్టీ నుంచి మీర్జా రెహ్మత్ బేగ్ అనే అభ్యర్థి ఒక్కరూ మాత్రమే నామినేషన్ దాఖలు చేయటంతో ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా రిటర్నింగ్ అధికారి ప్రయాంక ఆలా ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు గెలిచినట్లు ధృవీకరణ ప్రత్రాన్ని కూడా అందజేశారు.

Also Read: అమెరికాలో రూట్స్ టెక్-2023 ఎక్స్ పో

Advertisement

Next Story