- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Reservations: అశావహులకు గుడ్ న్యూస్.. ‘లోకల్’ రిజర్వేషన్లకు ముహూర్తం ఫిక్స్!

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్లఅంశాన్ని తేల్చేందుకు సిద్ధమైంది. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్లు ప్రధానమైనవి. ఇందుకోసం నియమించిన డెడికేటెడ్కమిషన్ తన రిపోర్టును వచ్చే నెల 2వ తేదీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆ నివేదికపై కేబినెట్ సబ్‌కమిటీ చర్చించి రాష్ట్ర మంత్రివర్గానికి సిఫార్సు చేయనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 5న కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భేటీలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం లభించగానే, 7న ప్రత్యేకంగా రాష్ట్ర అసెంబ్లీని సమావేశ పరచనున్నారు. ఇందులో బీసీ రిజర్వేషన్‌లపై చర్చించి రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన చట్ట సవరణలను చేయాల్సిందిగా ప్రభుత్వం సభ్యులను కోరనుంది. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణపైనా రాష్ట్ర సర్కారు డెసిషన్ తీసుకోనున్నది. ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో ఏకసభ్య కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్నివేదిక సైతం సిద్ధమైంది. దీనినీ ప్రభుత్వం కేబినెట్‌లో ఆమోదించనుంది.
అమల్లోకి ఎన్నికల కోడ్..
ఇప్పటికే శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్అమల్లోకి వచ్చింది. దీంతో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం ఎన్నికల కోడ్‌కు కిందకు వస్తుంది. కేబినెట్ భేటీని ఏర్పాటు చేయాలన్నా.. దానికి ఈసీ అనుమతి అవసరం కానుంది. అందుకోసం సీఎస్ శాంతికుమారి కేబినెట్ భేటీకి అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాయాల్సి ఉంటుంది. అయితే, ఈ సమావేశంలో ఏ అంశాలను ఎజెండాలో చేర్చుతారు? ప్రజలను ప్రభావితం చేసే, వారిని ఆకర్షించే, తాయిలాలు ఇచ్చే నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? అనే వివరాలను ఈసీ పరిశీలిస్తుంది. సీఎస్రాసిన లేఖను రాష్ట్ర ఈసీ అధికారులు.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు.
ఎన్నికల వరాలు, తాయిలాలు, ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు ఏవీ కోడ్అమల్లో ఉన్నప్పుడు ఏర్పాటయ్యే కేబినెట్‌లో ఉండటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. బీసీలకు రిజర్వేషన్‌పెంపు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోవడం రెండూ ప్రజలను, ఓటర్లను ప్రభావితం చేసేవేనని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సింది. గతంలో ఈసీ షరతులతో కూడిన అనుమతి మాత్రమే ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించే అనుమతి ఇవ్వలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలకమైన కేబినెట్, అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహణపై ఈసీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది.