జనాభా ప్రకారమే రిజర్వేషన్లు.. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ నేత సమగ్ర వివరణ

by Ramesh Goud |
జనాభా ప్రకారమే రిజర్వేషన్లు.. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ నేత సమగ్ర వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ (SC classification)పై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ (AICC General Secretary Sampath Kumar) వివరణ ఇచ్చారు. జనాభా శాతం (percentage of population) ప్రకారమే రిజర్వేషన్లు (reservations) ఇచ్చామని, ఎక్కడా కూడా వివక్షచూపలేదని (no discrimination) ఆయన చెప్పారు. గాంధీ భవన్ (Gandhi Bhavan)లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. వర్గీకరణ లెక్కలకు సంబంధించి కూలంకుశంగా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ జనాభా లెక్కల ప్రకారమే తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉషా మెహర్ కమిటీ వేసిందని, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉదృతం కావడంతో మరుగున పడిందన్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ లు వర్గీకరణను అడ్డుకున్నాయని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక.. సుప్రీం కోర్టులో బలమైన వాదనలు వినిపించడం జరిగిందని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. ఏకసభ కమిషన్ వేసి, కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం మూడు గ్రూపులుగా వర్గీకరణ చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తో విడిపోయాక కొన్ని కులాలు తెలంగాణలో లేవు కాబట్టి మూడు గ్రూపులు గా చేశారని వివరించారు. ఇర గ్రూప్ 1 కి 1శాతం.. గ్రూప్2 కి 9శాతం.. గ్రూప్ 3 కి 5 శాతం.. రిజర్వేషన్ కేటాయించడం జరిగిందన్నారు. అలాగే గ్రూప్ 1 లో 15 కులాలు ఉన్నాయని, గ్రూప్ 2 లో 18 కులాలు ఉన్నాయని తెలిపారు.

ఇక గ్రూప్ 3 లో 26 కులాలు ఉండగా 33.96 శాతం మాత్రమే ఎస్సీ జనాభాలో ఉన్నారని, ఇది ఏ ఒక్క కులానికి ఇచ్చిన రిజర్వేషన్ కాదని, ఆ గ్రూప్ లో ఉన్న అన్ని కులాలకు వర్తిస్తుందని వెల్లడించారు. దీని ప్రకారం 5శాతం రిజర్వేషన్ ఇచ్చింది మాలలకు ఒక్కరికే కాదని, గ్రూప్ 3 లో ఉన్న అన్ని కులాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. 5శాతం రిజర్వేషన్ మాలలకు మాత్రమే కాదని, అందులో ఉన్న ఇతర కులాల జనాభా 2 లక్షల 44వేల మందికి వర్తిస్తుందని అన్నారు. గ్రూప్ 3 కి కేటాయించిన 9 శాతంలో మాదిగలకు మాత్రమే కాదని, అందులో ఉన్న ఇతర కులాలకు కూడా వర్తిస్తుందని, ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎవరికి అన్యాయం జరగదని, ఎవరికి ఎక్కువ న్యాయం కూడా జరగదని తేల్చి చెప్పారు. ABCD వర్గీకరణ నుంచి మూడు గ్రూప్ లలో కుదించేందుకు భావ స్వరూప్యతా.. సంప్రదాయాలు కలగలిసిన కులాలను ఒక్కటి చేశారని కాంగ్రెస్ నేత చెప్పారు.

Next Story

Most Viewed