SLBC Tunnel: సొరంగంలో అరుపులు కేకలు.. వాటర్ స్కానర్లు, లైఫ్ జాకెట్లు ధరించి రంగంలోకి ఆర్మీ టీమ్

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-23 07:54:35.0  )
SLBC Tunnel: సొరంగంలో అరుపులు కేకలు.. వాటర్ స్కానర్లు, లైఫ్ జాకెట్లు ధరించి రంగంలోకి ఆర్మీ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో 24 మంది సింగరేణి బృందం(Singareni Team), 120 ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు(SDRF Teams), ఆర్మీ టీమ్, రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. సొరంగ మార్గంలో 13.5 కిలోమీటర్ల వరకు సహాయక బృందాలు వెళ్లాయి. మరో కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీరు అడ్డంకిగా మారాయి. అడ్డంకులను అధిగమించి ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సొరంగలో నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్(Tunnel Boring Mission) 80 మీటర్ల వెనక్కి వచ్చినట్లు సమాచారం. టన్నెల్ బోరింగ్ వెనక్కి రావడంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. దీంతో చిక్కుకున్న వారి స్పందన కోసం సొరంగంలో రెస్క్యూ టీమ్(Rescue Team) అరుపులు, కేకలతో హోరెత్తిస్తున్నారు. అండర్ వాటర్ స్కానర్లు, లైఫ్ జాకెట్లు ధరించి సొరంగం కూలిన ప్రాంతానికి ఆర్మీ బృందం లోకో ట్రెయిన్ సాయంతో వెళ్తోంది. 14 కిలోమీటర్లలో 12 కి.మీ వరకే ట్రెయిన్ వెళ్లే అవకాశం ఉండగా.. మిగిలిన దూరం నడుచుకుంటూ వెళ్తారా? తిరిగి వస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

శనివారం ఉదయం పనికోసం టన్నెల్‌లోకి మొత్తం 52మందికి పైగా సిబ్బంది, కార్మికులు వెళ్లగా.. అనుకోకుండా టన్నెల్లో ఒక్కసారిగా నీళ్లు.. మట్టిపెడ్డ కులాయి.. వెంటనే పనులు చేస్తున్న కార్మికులు.. సిబ్బంది ప్రాణాలు అరచేత పెట్టుకుని బయటకు వచ్చారు. ముగ్గురు కార్మికులు గాయపడటంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. మిగతా ఎనిమిది మంది కార్మికులు బయటకు రాలేక, అక్కడే ఉండి పోవడంతో.. అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఆ 8 మంది సురక్షితంగా ఉన్నారా..?? లేదా మట్టి.. నీళ్లల్లో కలిసిపోయారా..!!? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది సంఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.




Next Story

Most Viewed