- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటన వేళ రేణుకా చౌదరి అసంతృప్తి.. టికెట్ల కేటాయింపుపై ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: టీ కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తి వెల్లగక్కారు. కమ్మ నేతలకు టికెట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. డబ్బు ఉన్నవారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారని, సామాజిక న్యాయం చేయడం లేదని ఆరోపించారు. కమ్మ సామాజికవర్గానికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అంత లోకువ ఎందుకని ప్రశ్నించారు. కమ్మ నేతలు గుర్రుగా ఉన్నారని, వారి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని రేణుకా చౌదరి సూచించారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపై రేణుకా అసంతృప్తి వ్యక్తం చేశారు. కమ్మ నేతలను తక్కువ అంచనా వేయవద్దని, ఏదో పిల్లికి భిక్షం వేసినట్లు నాలుగు బిస్కెట్లు వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి నేతలకు ఆహ్వానాలు వస్తున్నాయని, సీట్లు ఇవ్వడంతో పాటు ఆర్ధికంగా కూడా చూసుకుంటామని హామీలు ఇస్తున్నారని అన్నారు. డబ్బు ఉన్న వారి కంటే దమ్మున్నోళ్లకు సీట్లు కేటాయించాలని రేణుకా సూచించారు.