- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Remand Report: కలెక్టర్‌పై దాడి కేసులో సంచలనం.. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు
దిశ, వెబ్‌డెస్క్: కలెక్టర్‌పై దాడి కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) రిమాండ్ రిపోర్టు (Remand Report)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేరును కూడా పోలీసులు చేర్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో పాటు.. ఇతరుల ఆదేశాలు కూడా ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. రైతులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారని పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) అనుచరుడు భోగమోని సురేష్ (Bhogamoni Suresh) ద్వారా గ్రామస్థులను ప్రభావితం చేసి.. గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు డబ్బులిచ్చి దాడికి ఉసిగొల్పానట్లుగా రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అధికారులను చంపినా పర్వాలేదంటూ రైతులకు పట్నం నరేందర్‌రెడ్డి (Patnam Narender Reddy) చెప్పారని పోలీసులు తెలిపారు.
కాగా, కలెక్టర్, అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy)ని అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం ఇవాళ కొడంగల్ కోర్టు (Kodangal Court)లో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అక్కడి నుంచి పోలీసులు నరేందర్ రెడ్డిని నేరుగా చర్లపల్లి జైలుకు తరలించారు.