IT Raids పై స్పందన.. పార్టీ మార్పుపై Marri Rajashekar Reddy కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2022-11-24 05:55:06.0  )
IT Raids పై స్పందన.. పార్టీ మార్పుపై Marri Rajashekar Reddy  కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే తమపై దాడులు జరుగుతున్నాయని మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్‌గిరి నియోజకవర్గ టీఆర్ఎస్ కీలక నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. తామేం తప్పుడు పనులు చేయడం లేదని, ప్రతీ పైసకూ ట్యాక్సులు కడుతున్నామని అన్నారు. తమ ఇంట్లో రూ.4 కోట్లు సీజ్ చేశారని స్పష్టం చేశారు. తమను పార్టీ మార్పించాలనే ఉద్దేశంతోనే దాడులు చేయిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తాము పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఐటీ అధికారులు ఏమాత్రం మానవత్వం లేకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి సంతకాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు.



Next Story

Most Viewed