- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నివాసాల మధ్య వర్మి కంపోస్టు కంపెనీలు
దిశ, అబ్దుల్లాపూర్మెట్ : నివాసాల మధ్య ఉన్న వర్మి కంపోస్టు కంపెనీలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మురుగు వాసనతో చుట్టుపక్కల నివసించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద అంబర్పేట నుంచి పసుమముల వెళ్లే దారితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్మి కంపోస్టు కంపెనీలు ఉన్నాయి. వర్మి కంపోస్టు తయారీ నిమిత్తం తీసుకువచ్చే పేడ ఇతర వాటితో చుట్టూ వాసన వెదజల్లుతోందని స్థానికులు వివరిస్తున్నారు. వర్మీ కంపోస్టులు మొత్తం చుట్టుపక్కల చెట్ల మధ్య నివాసాల మధ్య ఉండడంతో పాములు పేడ నుంచి వస్తు ఇళ్లల్లోకి వస్తున్నాయని వివరిస్తున్నారు.ఇప్పటికే పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
అదేవిధంగా ఈ మురుగు తో దోమలు విపరీతంగా ఇళ్లల్లోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దోమల బారిన రోగాలయ్యామని వివరిస్తున్నారు. పసుమాముల వెళ్లే దారిలో కొంతమంది స్థలాలను అద్దెకి తీసుకొని వర్మీ కంపోస్ట్ ని తయారు చేస్తున్నారని అంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పేడను లారీలలో, ట్రాక్టర్లలో తీసుకువస్తూ డంపు చేస్తున్నారని వాపోతున్నారు. డంప్ చేసే క్రమంలో రోడ్లపై పెద్ద ఎత్తున పడిపోయి రోడ్లన్నీ పాడై ఒక్కోసారి ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి వాహన దారులు కింద పడుతున్నారని వివరిస్తున్నారు. సంబంధిత భూ యజమానులు గతంలో ఇల్లు లేకపోవడం వల్ల అద్దెకు ఇచ్చిన కూడా ప్రస్తుతం చుట్టూ నివాసాలు ఏర్పడ్డాయని గుర్తించాలని కోరుతున్నారు.
ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు : పొగాకు నరసింహ స్థానికులు
నివాసాల మధ్య వర్మి కంపోస్టు ఉండటం కారణంగా దోమలు విపరీతంగా ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో రోగాల బారిన పడుతున్నాం. పేడను రోడ్లపై తరలించే క్రమంలో రోడ్డంతా పేడతో దుర్గంధం గా మారుతున్నాయి. పలువురు రోడ్డుపై పడి గాయలపాలైన ఘటనలు కూడా ఉన్నాయి. వర్మీ కంపోస్టు తయారీకి స్థలాలను అద్దెకిచ్చే యజమానులు కూడా కొంత ఆలోచించాలని కోరుతున్నాం. ఈ విషయాన్ని ఇప్పటికే సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం.