- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి చేతుల మీదుగా నిన్న ప్రారంభం.. నేడు తాళం
దిశ, వికారాబాద్ : గ్రూప్స్ తో పాటు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మరింత సౌకర్యార్థం రూ.1 కోటి 70 లక్షల నిధులతో నిర్మించిన నూతన రీడింగ్ రూమ్ భవనాన్ని గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. దాంతో విద్యార్థులు రేపటి నుండి నూతన భవనంలో అన్ని సౌకర్యాల మధ్య చదువుకోవచ్చు అనే సంతోషంలో జిల్లా కేంద్రంలో గల నూతన కేంద్ర గ్రంథాలయం దగ్గరకు వస్తే శుక్రవారం ఉదయం తాళం దర్శనం ఇవ్వడంతో విద్యార్థులు నిరాశకు గురయ్యారు. విషయం తెలుసుకొని బీజెవైఎమ్ స్టేట్ ఆర్టీఐ సెల్ కన్వీనర్ చిట్యాల సాయిచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయ భవనం ముందు నిరసన చేపట్టారు.
ఈ సందర్భాంగా చరణ్ రెడ్డి మాట్లాడుతూ నూతన భవనంలో ఇంకా ఫర్నిచర్ పనులు పూర్తి కాలేదని, కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా సరిగా లేకుండానే దశాబ్ది ఉత్సవాల పేరుతో హడావుడిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి భవనాన్ని ప్రారంభించడం, ప్రారంభం అయినా మరుసటిరోజు తాళం వేయడం సిగ్గుచేటు అన్నారు. కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన రీడింగ్ రూమ్ లో మరుగుదొడ్లు నిర్మించడానికి డబ్బులు సరిపోలేదా..? నామమాత్రంగా ఓపెన్ టాయిలెట్లు నిర్మించి వదిలేస్తే విద్యార్థినీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నిచారు. ఈ కార్యక్రమంలో బిజేవైఎమ్ నాయకులు కార్తీక్, సాయి, విక్కీ, శ్రీనివాస్ రెడ్డి, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.