- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాస్టల్ లో జరిగిన సంఘటన బాధాకరం
దిశ, తాండూరు రూరల్ :హాస్టళ్లలో జరిగిన సంఘటన చాలా బాధాకరమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వసతి గృహాల్లో విధుల పట్ల అశ్రద్ధ వహించకూడదని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ.శరత్ అధికారులకు సూచించారు. బుధవారం తాండూరు పట్టణ కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులను,వసతి గృహంలోని సౌకర్యాలపై ప్రిన్సిపల్ సెక్రెటరీ అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో విద్యార్థినీలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వహించకుండా బాధ్యతాయుతంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా వంటగదిని, స్టోర్ రూమ్ ను పరిశీలించి,విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ..వసతి గృహాల్లోని పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, అధైర్య పడకూడదని వసతి గృహానికి వచ్చిన పేరెంట్స్ తో అన్నారు. వంట కోసం, తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు 12 వేల హెచ్ టు ఎస్ టెస్ట్ వైల్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలో త్రాగునీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్టు తెలుసుకోవడానికి వైల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఆకస్మిక తనిఖీలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చందన సర్పె, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, తహసిల్దార్ తారా సింగ్ లు పాల్గొన్నారు.