Real hero : తాను మృతి చెందినా విద్యార్థులను కాపాడిన డ్రైవర్​

by Sridhar Babu |
Real hero : తాను మృతి చెందినా విద్యార్థులను కాపాడిన డ్రైవర్​
X

దిశ, రాజేంద్రనగర్ : కాలేజీ బస్సు నడుపుతున్న డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆయన వెంటనే చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు తిప్పి ఆపివేశాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. కళాశాల విద్యార్థులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శంషాబాద్ మండల పరిధిలోని కాచారం సమీపంలో ఉన్న అదే గ్రామానికి చెందిన రాజు కొంతకాలంగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అతడు నగరంలోని వివిధ ప్రాంతాల

నుంచి విద్యార్థులను తీసుకొని కళాశాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ లోని శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 287 వద్ద బస్సు నడుపుతుండగా అతడికి గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమతమైన అతడు వాహనాన్ని రోడ్డు పక్కకు నిలిపాడు.. గుండెపోటు వచ్చిన విషయాన్ని గమనించిన విద్యార్థులు వెంటనే అతడిని సమీపంలోని శ్రీ చంద్ర ఆసుపత్రికి తరలించగా గమనించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటివరకు తమతో ఉన్న డ్రైవర్ తమ కళ్లముందే మృతి చెందడంతో విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed