- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లమే ధ్యేయం : ఎమ్మెల్యే
దిశ,అబ్దుల్లాపూర్‌మెట్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో సుమారు 9కోట్ల 46 లక్షల పనులతో చేపట్టిన పలు పనులకు శంకుస్థాపనలు, పలు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.
నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన పనులు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం పూర్తిగా సహకరిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు నియోజకవర్గంలో అన్ని మండలాలు గ్రామాలు మున్సిపాలిటీలో అంచెలంచెలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ స్వప్న, వైస్ చైర్ పర్సన్ సంపూర్ణ రెడ్డి, కమిషనర్ నందికొండ రవీందర్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు సిద్ధంకి కృష్ణారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు,కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.