- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల చేత వెట్టి చాకిరి
దిశ, తాండూరు : బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాలయంలో వారితోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారు. పుస్తకాలు, పెన్నులు పట్టాల్సిన ఆ చేతులతోనే వంట చేయిస్తున్నారు. తాండూరు పట్టణ శివారులోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల చేత కూరగాయలు కట్ చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లాల్సిన ముగ్గురు విద్యార్థులను కూరగాయలు కట్ చేసే పనిని అప్పగించారు. విద్యార్థులకు రాత్రి భోజనం చేయాలంటే తప్పని పరిస్థితిలో కూరగాయలు కట్ చేయాల్సిందే. కాని పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు కూరగాయలు కట్ చేస్తుండగా పక్కనే కూర్చున్న కుక్ వారితో ముచ్చటించే పనిలో పడ్డారు. విద్యార్థులు కూరగాయలు ఎందుకు కట్ చేస్తున్నారని ప్రశ్నించగా పొంతన లేని సమాధానమిస్తూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి వంట మనిషి. అస్తవ్యస్తంగా మారినా మరుగుదొడ్ల నిర్వహణ సేఫ్టీ సిలిండర్లు సైతం మూలాన పడేసిన దృశ్యం కనిపించింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అగ్నిని అదుపు చేసేందుకు సేఫ్టీ సిలిండర్లు వాడటం కోసం ప్రభుత్వం వసతిగృహాలకు సరఫరా చేసింది. ఇవేవీ పట్టించుకోని హాస్టల్ వార్డెన్ వసతి గృహంపై నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కనిపించింది.