ప్రజాపాలనతో ముందుకు అడుగులు

by Sridhar Babu |
ప్రజాపాలనతో ముందుకు అడుగులు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనతో ముందుకు అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కొంగరకలాన్ లో మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి ప్రముఖులను, అధికార, అనధికారులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని, సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరించారు. ఈ వేడుకల్లో శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏఓ సునీల్, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed