- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం : సబితా ఇంద్రారెడ్డి
దిశ, చేవెళ్ల : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామంలో శుక్రవారం అండర్ గ్రౌండ్ డైనేజీ, సీసీ రోడ్లు, వైకుంఠధామం, ఊరెళ్ల అనుబంధ గ్రామం మెండివాగులో మైనార్టీ కమ్యూనిటీ హాల్ తదితర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు సభలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు దాదాపు పది జరిగిన అభివృద్ధిని చూసి పని చేసే ప్రభుత్వాన్ని దీవించాలని పిలుపునిచ్చారు. పుట్టిన బిడ్డనుంచి చనిపోయిన వ్యక్తి వరకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు.ముచ్చటగా మూడోసారి యాదయ్యను హాట్రిక్ ఎమ్మెల్యే గెలిపించుకొని చేవెళ్ల అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలకు కోరారు.
కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయాలి.. ఎమ్మెల్యే కాలె యాదయ్య
రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్‌ను 3వ సారి ముఖ్యమంత్రిని చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఊరెళ్ల సర్పంచ్ జహంగిర్, వైస్ చైర్మన్ నర్సింలు, సర్పంచ్‌లు మోహన్‌రెడ్డి, వెంకటేశం గుప్తా, నరహరి రెడ్డి, భీమయ్య, శివారెడ్డి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, రవీందర్ కుమార్ ఊరటి నరసింహులు చందు నరేందర్ రెడ్డి కుమార్ మైనార్టీ నాయకులు అబ్దుల్ గని గడ్డమీద శేఖర్ షరీఫ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.