ప్రభుత్వ భూమిపై కబ్జాకోరుల కన్ను!

by S Gopi |
ప్రభుత్వ భూమిపై కబ్జాకోరుల కన్ను!
X

దిశ, గండిపేట్: పేదవాడికి సెంటు భూమి ఇవ్వాలంటే అధికారులు సవాలక్ష ప్రశ్నలు అడిగి కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటారు. మరి గండిపేట్ మండ‌ల ప‌రిధిలో కోట్ల రూపాయ‌ల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. అధికార పార్టీ రాజకీయ నాయకుల అండదండలతో, అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ స్థలాల‌కే క‌బ్జారాయుళ్లు గురి పెడుతున్నారు. అస‌లే భూముల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ త‌రుణంలో క‌బ్జారాయుళ్ల క‌ళ్లు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల‌పై ప‌డుతున్నాయి. దీనికి ప్రభుత్వ స్థలాల‌నే క‌బ్జారాయుళ్లు ఎన్నుకుంటున్నారు. కోట్ల రూపాయ‌ల భూముల‌ను చేజిక్కించుకుని వాటిని ఎలాగైనా పొందాల‌నే ఆలోచ‌న‌తో రికార్డుల‌ను తారు మారు చేసి వాటిని సొంతం చేసుకోవాల‌ని ప్రయ‌త్నిస్తున్నారు. గండిపేట్ మండలం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తున్నారు. సర్వే నెంబర్ 205లో దాదాపు అర ఎక‌రా భూమి క‌బ్జాకు గుర‌వుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ మేర‌కు రెవెన్యూ అధికారులు సైతం క‌బ్జారాయుళ్లకు వ‌త్తాసు ప‌లుకుతున్నట్లు తెలుస్తుంది. ముడుపులు అంద‌డంతో క‌బ్జారాయుళ్లు ఏం చేసినా చ‌ర్యలు తీసుకోవ‌డానికి అధికారులు వెనుకాడుతున్నట్లు తెలుస్తుంది. ఔట‌ర్ రింగు రోడ్డు స‌ర్వీసు రోడ్డుకు ఆనుకొని ఉండ‌టంతో ప్రభుత్వ స్థలాన్ని క‌బ్జా చేస్తున్నారు. అధికారులు ఎవ‌రు చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డంతో అధికారుల తీరుపై ప‌లు అనుమానాల‌ను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా బై నెంబ‌ర్లతో రిజిస్ట్రేష‌న్లు చేసుకుని డోర్ నెంబ‌ర్, క‌రెంట్ మీట‌ర్లకు సైతం ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు ప్రచారం జ‌రుగుతుంది. అధికారుల మౌనంతో కోట్ల రూపాయ‌ల భూములు అన్యాక్రాంతం కాబోతున్నట్లు స్థానికులు వివ‌రిస్తున్నారు.

చ‌ర్యలు తీసుకోవ‌డంలో అధికారులు విఫ‌లం..?

గండిపేట్ మండ‌ల ప‌రిధిలో రెవెన్యూ అధికారులు క‌బ్జాల‌ను అరిక‌ట్టడంలో విఫ‌ల‌మ‌వుతున్నార‌ని స్థానికులు తెలుపుతున్నారు. ఏకంగా ప్రభుత్వ స్థలం క‌బ్జాకు గుర‌వుతున్నా అధికారుల మౌనం వెనుక ఏదో బూడు పుటాని ఉంద‌ని స్థానికులు చ‌ర్చించుకుంటున్నారు. ఏకంగా బై నెంబర్లతో రిజిస్ట్రేషన్ లు చేసుకుని డోర్ నెంబర్ కరెంట్ మీటర్లు సైతం అప్లై చేసినా కబ్జాదారులు, అన్ని తెలిసిన అధికారులు నిమ్మకునీరెత్తిన‌ట్లుగా ఉంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకోని ఉండడంతో కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అన్యాక్రాంతం అవుతుంద‌ని స్థానికులు మండిపడుతున్నారు. జీవో 58 59 జీవో కింద ప్రభుత్వ భూమిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికుల ప్రజల నుండి విశ్వసనీయమైన సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ స్థలాల‌ను కాపాడాల‌ని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed