- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శంకర్పల్లి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే యాదయ్య

దిశ, శంకర్పల్లి: శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య పేర్కొన్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐటీ మంత్రి కేటీఆర్ శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 25 కోట్ల నిధులను మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రూ. 25 కోట్ల నిధులను ఏయే వార్డులలో, ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని స్థానిక నేతలతో చర్చించారు.
నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాధాన్యత క్రమంలో నిధులను కేటాయించి సమస్యలు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, కౌన్సిలర్ లు చంద్రమౌళి, గోపాల్, శ్రీనాథ్ గౌడ్. కో ఆప్టేడ్ మెంబర్ మైమూడ్ . శంకర్పల్లి సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి. నాయకులు గోపాల్ రెడ్డి, పార్శి బాలకృష్ణ, రామ్ రెడ్డి, లింగం, ముంతాజ్, జాకీర్, ఖదీర్, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.